Telangana CLP Meeting : ముగిసిన సీఎల్పీ భేటీ.. సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ..
తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఎల్లా హెటల్లో నిర్వహించిన సీఎల్పీ భేటీ ముగిసింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నికల్లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం చేసింది.
కాసేపట్లో కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సీఎం పదవికి భట్టి విక్రమార్క సైతం పోటీపడినా అధిష్టానం రేవంత్కే జై కొట్టే అవకాశం ఉంది. ఇక ఇవాళ సాయంత్రమే సీఎం ప్రమాణం స్వీకారం ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాజ్ భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.