Congress manifesto : గెలిస్తే ఏ ఉద్యోగం ఏ తేదీన భర్తీ చేస్తారంటే..!

Byline :  Kiran
Update: 2023-11-17 08:42 GMT

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించింది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసిన ఆ పార్టీ మేనిఫెస్టోలోనే ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్పెషల్ డిపార్ట్మెంట్ ద్వారా 2లక్షల నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది. ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులెవరూ ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టనవసరం లేదని స్పష్టం చేసింది.




 


అధికారంలోకి వస్తే గ్రూప్ 1,2,3,4 నియామకాల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది. తేదీలతో సహా వివరాలు ప్రకటించింది. గ్రూప్ - 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 1న మొదలుపెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గ్రూప్ 2, 3, 4 ఉద్యోగాలను మాత్రం రెండు దశల్లో భర్తీ చేయనున్నట్లు చెప్పింది. తొలిదశ గ్రూప్ 2 నియమాకాలను 2024 ఏప్రిల్1, రెండో దశను 2024 డిసెంబర్ 14న షురూ చేస్తామని స్పష్టం చేసింది. ఇక గ్రూప్ 3, 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 2024 జూన్ 1, 2024 డిసెంబర్ 1న ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.


 



ఉపాధ్యాయ ఖాళీల భర్తీపైనా కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. రెండు దశల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1న టీచర్ల ఉద్యోగాల భర్తీ ఫేజ్ 1 ప్రక్రియ ప్రారంభిస్తామని, అదే ఏడాది డిసెంబర్ 15న సెకండ్ ఫేజ్ డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. వీటితో పాటు పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తేదీలను సైతం మేనిఫెస్టోలో పొందుపరిచింది.




Tags:    

Similar News