TS Election : కొనసాగుతున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం

Byline :  Kiran
Update: 2023-10-08 10:33 GMT

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడంపై నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో లిస్ట్ తయారు చేసి కాంగ్రెస్ హైకమాండ్ కు పంపనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీయై బరిలో నిలిపే అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. ఈ నెల 14 లో తుది జాబితా సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో తమకు 34 సీట్లు ఇవ్వాల్సిందేనని ఓబీసీ నేతలు పట్టుబడుతున్నారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు చొప్పున టికెట్లు బీసీలకు కేటాయించాలని ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు. ఒకవేళ పార్టీ హైకమాండ్ తమ అభ్యర్థనను పట్టించుకోకపోతే ఉద్యమానికి సైతం సిద్ధమని తెగేసి చెబుతున్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గం నేతలు సైతం టికెట్ల కేటాయింపులలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ గత నెల 22న జరిగిన సమావేశంలో దాదాపు 80కి పైగా స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడు ఖమ్మం జిల్లా అభ్యర్థుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ రోజు భేటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.




Tags:    

Similar News