Breaking News : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఎన్నికలు ఎప్పుడంటే..?

Byline :  Krishna
Update: 2023-10-09 07:11 GMT

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికి సంబంధించి నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 10 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు ఇచ్చింది.షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

తెలంగాణలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. అన్నీ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదపుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. ఈ సారి ఎలాగైన ప్రభుత్వాన్ని ఏర్పాటచేయాలని ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త విధానం పాటిస్తోంది. ఆశావాహులు దరఖాస్తులు చేసుకుని నెల దాటుతున్నా వడపోత కార్యక్రమం మాత్రం ఇంకా ముగియలేదు.


Tags:    

Similar News