2024 ఏడాదికి సంబంధించిన సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పండుగలు, జాతీయ సెలవులు కలిపి 27 సాధారణ, 25 ఆప్షనల్ హాలిడేస్ను ప్రకటించింది. ప్రభుత్వం సూచించిన ఈ 25 రోజుల్లో ఏవేని ఐదింటిని వాడుకోవచ్చని సూచించింది. ప్రతి నెలా రెండో శనివారాన్ని సెలవుగా ప్రకటించినా ఫిబ్రవరిలో మాత్రం వర్కింగ్‌డే గా ఉంటుందని తెలిపింది. జనవరి ఫస్ట్‌కు హాలిడే ప్రకటించగా.. ఆ సెలవును దీంతో అడ్జస్ట్ చేసింది. శివరాత్రి పండుగ మార్చి 8న గురువారం రాగా.. ప్రభుత్వం శుక్రవారం సెలవు ఇచ్చింది. ఆ తర్వాతి రోజు రెండో శనివారం రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.