Gangula Kamalakar : గంగుల కమలాకర్ కు హైకోర్టులో ఊరట

Update: 2023-11-08 06:27 GMT

హైకోర్టులో మంత్రి గంగుల కమలాకర్‌కు ఊరట లభించింది. గంగుల ఎన్నిక చెల్లదంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్‌ను హై కోర్టు బుధవారం కొట్టివేసింది. గంగుల కమలాకర్ ఎన్నికల చెల్లదంటూ పొన్నం వేసిన పిటిషన్‌ను తాజాగా హై కోర్టు కొట్టివేసింది. 2018లో పొన్నం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎన్నికల పరిమితికి మించి ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేవని పిటిషన్‌ను హై‌కోర్టు తాజాగా కొట్టివేసింది.

 ఈ పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. 2018 ఎన్నికల్లో గంగుల పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ BJP ఎంపీ బండి సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.




Tags:    

Similar News