Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నిక చెల్లదంటూ..

Byline :  Krishna
Update: 2023-10-10 05:59 GMT

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ను కొట్టేసింది.

2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని రాజవేంద్ర రాజు ఆరోపిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా నామినేషన్ వేసేటప్పుడు ఒక అఫిడవిట్, తర్వాత మరో అఫిడవిట్ సమర్పించారని అందులో వివరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి రెండు రోజుల ముందు ఈసీ వెబ్ సైట్‌లో కొత్త అఫిడవిట్ అప్‌లోడ్ చేశారని.. ఇది చట్ట విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ కొట్టేస్తూ తీర్పునిచ్చింది.


Tags:    

Similar News