Telangna election : బీఆర్ఎస్‌కు ఎన్నికల సంఘం నోటీసులు..
By : Mic Tv Desk
Update: 2023-11-27 16:58 GMT
పార్టీల అత్యుత్సాహం ఎన్నికల సంఘానికి అదనపు పని పెడుతోంది. ఇప్పటికే పలు అంశాలపై పార్టీలను నోటీసులు జారీ చేసిన ఈసీ పోలింగ్ దగ్గర పడడంతో మరిన్ని తాఖీదులు జారీ చేస్తోంది. ‘స్కాంగ్రెస్’ పేరుతో బీఆర్ఎస్ వివాదాస్పద ప్రకటనలు ఇవ్వడంపై ఆ పార్టీకి ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సోమవారం నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. స్కాంగ్రెస్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఆయన అలాంటి ప్రకటనలు ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఈ నెల 21న పత్రికల్లో ప్రకటనలతో హోరెత్తించింది.