TS Assembly Elections 2023 : దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు : రాహుల్

Byline :  Krishna
Update: 2023-10-20 15:35 GMT

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ముగిసింది. ములుగులో ప్రారంభమైన యాత్ర.. భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల మీదుగా ఆర్మూర్ వరకు 3రోజుల పాటు కొనసాగింది. రాహుల్ యాత్రతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోష్ కన్పిస్తోంది. ఈ పర్యటన తర్వాత ఢిల్లీ వెళ్లిన రాహుల్ ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్నాయంటూ ట్వీట్ చేశారు.

‘‘ఈ ఎన్నికలు.. దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్నాయి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు తెలంగాణలోని ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాయన్నారు. మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత, రైతు భరోసా స్కీంలను అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ రాబోతుంది. కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ సాకరమవుతుంది. ఇది నా గ్యారెంటీ’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.




Tags:    

Similar News