TS Assembly Elections 2023 : వివేక్తో రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్లోకి మాజీ ఎంపీ..!

Byline :  Krishna
Update: 2023-10-29 04:47 GMT

తెలంగాణ కాంగ్రెస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి క్యూ కట్టారు. ఒకప్పుడు బీజేపీలోకి వెళ్లిన నేతలు సైతం తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఇటీవలె కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. తాజాగా మరో బీజేపీ నేత కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ రేవంత్ రెడ్డి సదరు నేతతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ నేత వివేక్‌తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రంలో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి రావాలని వివేక్ను ఆహ్వానించినట్లు సమాచారం. వివేక్ కాంగ్రెస్ లో చేరుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఈ ప్రచారాన్ని ఖండించారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే తాజాగా రేవంత్తో భేటీ అవడం ప్రాధాన్యంత సంతరించుకుంది.


Tags:    

Similar News