Revanth Reddy : రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది - రేవంత్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-11-17 08:00 GMT

మేనిఫెస్టోనే కాంగ్రెస్‌ పార్టీకి భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీధర్‌బాబు కన్వీనర్‌గా ఉన్న కమిటీ దానిని రూపొందించిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారైందని రేవంత్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ రాబోతోందని, ప్రజలు కోరుకుంటున్న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపుచూస్తున్నారని రేవంత్ అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించని అధికారపార్టీకి గుణపాఠం చెప్పాలని యువత అనుకుంటోందని చెప్పారు. పదేండ్లు అధికారమిచ్చినా కేసీఆర్ సర్కారు ఏం చేయనందున ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశమివ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.




Tags:    

Similar News