Revanth Reddy : నేడు కొడంగల్‌లో నామినేషన్ వేయనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-11-06 02:24 GMT

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్లల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ లో నామినేషన్ వేయనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో కొడంగల్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆర్వో కార్యాలయానికి ఊరేగింపుగా వెళ్ళనున్నారు.

ఇక కొడంగల్‌ తో పాటుగా సీఎం కేసీఆర్ పై కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు రేవంత్. నేడు కొడంగల్‌లో నామినేషన్ వేయనుండగా.. నవంబర్ 10న కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీ చేస్తు్ండటంతో ఈ సారి ఎన్నికలు మరింత అసక్తిగా మారాయి. ఇక, రేవంత్​ కామారెడ్డి బరిలో ఉంటుండటంతో షబ్బీర్​అలీ నిజామాబాద్​ అర్బన్​ నుంచి బరిలోకి దిగనున్నారు. కాగా సీఎం కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఈనెల మూడు నుంచి ప్రారంభమైంది. పదవ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు సమర్పించారు. ఇప్పటివరకు 240 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో టీడీపీ తరఫున కొడంగల్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి 5976 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వరుసగా రెండోసారి టీడీపీ నుంచి బరిలో నిలిచి 14614 ఓట్ల మెజార్టీతో గెలిచారు.




Tags:    

Similar News