Revanth Reddy : ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడేది లేదు.. రేవంత్ రెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-11-09 05:37 GMT

ఖమ్మం, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడుల అంశంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన ‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేతెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం.’ అని ట్వీట్ చేశారు.

ఇది బిఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని చెప్పిన రేవంత్... ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడరని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర కాంగ్రెస్ అంత అండగా ఉంటుందని, ఓటమి భయంతోనే బిఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలుగా అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకులను ఐ.టి టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తుందన్నారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐ.టి దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని ఆరోపించారు. బిఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీ లకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.


 


Tags:    

Similar News