TS Assembly Elections 2023 : డబ్బులివ్వలేదని.. బీఆర్ఎస్ నేతలను గదిలో పెట్టి తాళం వేసిన ఓటర్లు

Byline :  Bharath
Update: 2023-11-30 12:36 GMT

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా.. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు నిరసన సెగలు తగుతున్నాయి. ఓటు అడగడానికి వెళ్లిన నేతలను అడ్డుకుంటున్నారు. తిరగబడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, దయాకర్ రావులను ప్రజలు నిర్భందిస్తున్నారు. వారి పాలనలో తమ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఫైర్ అవుతున్నారు. ఇవాళ పోలింగ్ ఉండగా నిన్నటినుంచే.. పలు ప్రాంతాల్లో కార్యకర్తలంతా ప్రజలకు డబ్బు పంచారు. దీంతో పలువురికి డబ్బు అందలేదని ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించగా.. మంగపేట లో తమకు డబ్బులివ్వలేదని ఆగ్రహించిన ప్రజలు.. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గదిలో పెట్టి తాళం వేశారు. దీంతో ప్రజలు పార్టీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు వనమా వెంకటేశ్వరరావుకు కూడా నిరసన సెగ ఎదురైంది. అందరికీ డబ్బులు పంచి తమకు పంచకుండా అన్యాయం చేశారంటూ ప్రజలు వనమా ఇంటిని ముట్టడించారు.


 

 

Tags:    

Similar News