TelanganaTotal Voters : తెలంగాణలో భారీగా పెరిగిన ఓటర్లు.. యూతే టార్గెట్
తెలంగాణ రాష్ట్రంలో యువ ఓటర్లు భారీగా పెరిగారు. రానున్న ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయికి యూత్ ఓటు బ్యాంక్ పెరిగిపోయింది. ఈసీ ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,17,17,389 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 18 నుంచి 39 ఏండ్లలోపు వాళ్లు1,60,07,252 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ జాబితాతో పోల్చితే 30 శాతం మంది యువ ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో వారి ఓటు బ్యాంక్ ను దక్కించుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే వినాయక చవితి, దేవీ నవరాత్రుల్లో విగ్రహాలను ఇప్పించడం, కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయడం, నిమజ్జన ఏర్పాట్లు చేయడం చేశారు. గ్రామీణ ప్రాంతాల యువకులకు స్పోర్ట్స్ కిట్ లు స్పాన్సర్ చేశారు. దీంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. అందులో యాక్టివ్ గా ఉంటూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పార్టీపై ఫోక్ సాంగ్స్ క్రియేట్ చేయించి విడుదల చేస్తున్నారు.