హైదరాబాద్‎లో రెడ్ అలర్ట్..అతి భారీ వర్ష హెచ్చరిక

Update: 2023-07-27 05:30 GMT

బుధవారం రాత్రి నుంచి భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. కొన్ని సార్లు అత్యంత వేగంగా జల్లులు కురుస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. మరోవైపు ఈరోజు కూడా భాగ్యనగరంతో పాటు చుట్టుపక్కన ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని సార్లు అత్యంత వేగంగా జల్లులు కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. అదే విధంగా నగరంలో ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. ఈరోజు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్యే నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్‎లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.

భారీ వర్షాలతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మోకాళ్లోతు నీళ్లల్లో నిండిపోయాయి. పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు విద్యుత్, నీటి సరఫరాలకు కూడా అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజలు అత్యవసరం అయితేనే ఇంటికి రావాలన్నారు.

Tags:    

Similar News