ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం.. శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ ప్రాంతాలపై విస్తరించినట్లు ఐఎండీ తెలిపింది. దాంతో రాగల 24 గంటల్లో ఏపీలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించి.. వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.
రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఈరోజు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో.. వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.