ప్రాణ ప్రతిష్ఠ రోజున పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారంటే?
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. ఇక రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగింది. కాగా రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన పుట్టిన శిశువుకు ఓ ముస్లిం తల్లి రాముడి పేరు పెట్టింది. వివారల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఫర్జానా అనే ఓ ముస్లిం మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజును మగబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబం చాలా సంతోషపడింది. హిందూ-ముస్లిం ఐక్యతను సూచించేలా శిశువు బామ్మ హుస్నా బాను తన మనవడికి రామ్ రహీమ్ అని పేరు పెట్టింది. ఇక తల్లీకొడుకులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి ఇంఛార్జ్ డాక్టర్ నవీన్ జైన్ తెలిపారు.
కాగా నిన్ని అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్లిన ప్రధాని మోడీ మొదట బాల రాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా రామ్ లల్లాకు 114 కలశాలలో ఔషధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. తర్వాత రాముడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత బాల రాముడి పాదలకు మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు.రాముని ప్రాణ ప్రతిష్ఠతో దేశమంతా రామ నామ స్మరణతో మార్మోగింది.