మల్లికార్జున ఖర్గేకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

Update: 2024-02-22 14:34 GMT

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు భద్రతను పెంచారు. ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఖర్గే భద్రతకు ముప్పు ఉందంటూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదిక ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఖర్గేకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) భద్రత కల్పించనుంది. ఇక జడ్ ప్లస్ కేటాగిరీలో ఆరుగురు గన్ మెన్ లు, ఇంటి వద్ద కాపలాకు మరో ఇద్దరిని (ప్లస్ 8) పెడతారు. ఇక ఆయన బయట పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన వెంట 50 మందికి పైగా కమాండోలు వస్తుంటారు.

జడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 గంటలు భద్రత ఉంటుంది. కనీసం 36 మంది భద్రతా సిబ్బంది షిఫ్టుల వారీగా కాపలా కాస్తారు. జడ్ ప్లస్ కేటాగిరీలో ఉన్న వాళ్లకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సీఐఎస్ఎఫ్ లు భద్రత నిర్వహిస్తాయి. కొన్నిసార్లు ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఎస్కార్ట్ గా ఉంటారు.

దేశంలో ఎవరెవరికీ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందంటే?

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం, హైకోర్టు జడ్జిలు, గవర్నర్లు, సీఎంలు, కేంద్ర కేబినెట్ సభ్యులకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంత మందికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. దేశంలో ఇలా 63 మంది జడ్ ప్లస్ కేటగిరి భద్రత పొందుతున్నారు. ఇందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చంద్రబాబు, ముఖేశ్ అంబానీ,మాయవతి వంటి వారు ఉన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 గంటలూ భద్రత ఉంటుంది. కనీసం 36 మంది భద్రతా సిబ్బంది షిప్టుల వారీగా కాపలా కాస్తారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నవారికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సీఐఎస్ఎఫ్‌లు భద్రత నిర్వహిస్తారు. జడ్ ప్లస్ కేటగిరీలో భాగంగా రక్షణ కల్పించే ఎన్ఎస్జీ కమాండోల దగ్గర ఎంపీ5 సబ్ మెషిన్ గన్లు, ఏకే-47 రైఫిళ్లు సహా అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా వీవీఐలకు పైలట్, ఎస్కార్ట్ కారు నిరంతరం అందుబాటులో ఉంటాయి.


Tags:    

Similar News