కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పునియా తదితరులు కలిశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కొత్త చీఫ్ గా సంజయ్ సింగ్ నిన్న ఎన్నికైన విషయం తెలిసిందే. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI మాజీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ ఎన్నికకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు తమ గళాన్ని వినిపించారు. ఈ క్రమంలోనే నిన్న సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పారు. ఇవాళ భజరంగ్ పునియా పద్మశ్రీ ని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. తన అవార్డును ప్రధాని మోడీకి పంపిస్తానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ ఎన్నికతో అసంతృప్తితో ఉన్న రెజ్లర్లు ప్రియాంకగాంధీని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వ్యక్తి తాజాగా WFI చీఫ్ గా ఎన్నికవడం తమను తీవ్రంగా బాధించిందని చెప్పారు. తమకు న్యాయం చేయాలని బాధిత రెజ్లర్లు ప్రియాంకను కోరినట్లు తెలిపారు.