హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఫిబ్రవరి 22న చర్చ

Update: 2024-02-20 14:48 GMT

హర్యానా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి స్పీకర్ చంద్ గుప్తా అంగీకారం తెలుపుతూ ఫిబ్రవరి 22న అసెంబ్లీలో చర్చకు అనుమతిచ్చారు. ఖట్టర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఇటీవల ప్రతిపక్ష నేత భూపీందర్ సింగ్ హుడాఆరోపించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకువస్తుందని ఆయన ముందే చెప్పారు. మూడేళ్ల కిందట బీజేపీ-జేజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం తెచ్చినా అది వీగిపోయింది. కొద్దిరోజుల కిందట సీఎం మనోహర్ ఖట్టర్ గతంలో అవిశ్వాసం తీర్మానం గురించి ప్రస్తావించారు. ప్రతి సెషల్ లో తమ ప్రభుత్వం చేసిన పని గురించి తెలుసుకోవడానికి ప్రతిపక్షాలు తప్పనిసరిగా అలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ మళ్లీ అవిశ్వాస తీర్మానం తీసుకువస్తే ప్రభుత్వం చేసిన పనుల గురించి వారు మళ్లీ వినాల్సివస్తుందని ఖట్టర్ చెప్పుకొచ్చారు. కాగా దేశంలో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. జార్ఖండ్, బీహార్, ఢిల్లీ ప్రభుత్వాలు వరుసగా విశ్వాస పరీక్షలు ఎదుర్కొన్నాయి. జార్ఖండ్ చంపయ్ సోరెన్ ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్ లో గెలిచింది. అలాగే బీహార్ నితీశ్ కుమార్ సర్కార్ గెలిచింది. ఇటీవల కేజ్రీవాల్ కూడా విశ్వాస పరీక్ష వెళ్లి నెగ్గారు.


Tags:    

Similar News