ఆ రెండు రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్

Byline :  Vijay Kumar
Update: 2023-12-16 15:52 GMT

ఇంకో 5 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలోనే ఆ రెండు రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా జితూ పట్వారీని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్ సీఎల్పీ నేతగా ఉమంగ్ సింఘార్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటిదాక అక్కడి పీసీసీ చీఫ్ గా ఉన్న కమల్ నాథ్ సేవలను కొనియాడింది. అదే విధంగా చరణ్ దాస్ మహంత్ ను ఛత్తీస్‌గఢ్ సీఎల్పీ నేతగా అనౌన్స్ చేసింది. ఇక ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ గా దీపక్ బైజ్ ను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ రాష్టాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఒక్క తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా.. మిజోరంలో జెడ్పీఎం జయకేతనం ఎగురవేసి అధికారం చేపట్టింది. 

Tags:    

Similar News