ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి ఆ పరీక్షకు రిజిస్ట్రేషన్ షురూ

Byline :  Vijay Kumar
Update: 2024-02-25 11:10 GMT

దేశంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలుగా సెంట్రల్ యూనివర్సిటీలకు పేరుంది. మంచి బోధన, వసతులు, ఉద్యోగావకాశాలకు కేరాఫ్ అడ్రస్ గా వాటికి పేరుంది. అలాంటి యూనివర్సిటీల్లో విద్యనభ్యసించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. రేపటి నుంచి CUET-UG అప్లికేషన్స్ ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ రేపు సాయంత్రం లోగా కాకపోతే ఎల్లుండి కచ్చితంగా అప్లికేషన్స్ ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు. అప్లికేషన్ తేదీలు, ఫీజు, ఇతర వివరాలను NTA వెబ్ సైట్ లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. కాగా ఇంతకు ముందు సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి ఆయా యూనివర్సిటీలకు ప్రత్యేక ఎంట్రెన్స్‌ టెస్టులు నిర్వహించేవారు. విద్యార్థులు వివిధ పరీక్షలకు ప్రిపేర్‌ కావాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి సమస్య లేదు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ఎంట్రెన్స్ టెస్ట్‌గా కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET) నిర్వహిస్తున్నారు.

తాజాగా 2023-24 అకడమిక్ ఇయర్ కోసం రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేయనుంది. ఇక ఇంటర్మీడియేట్ చదివిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కాగా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఇందుకు కోసం దేశవ్యాప్తంగా 1000 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజూ 450 నుంచి 500 సెంటర్లను పరీక్ష కోసం వినియోగించనున్నారు.



Tags:    

Similar News