ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనవరి 3న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ పలు కారణాలతో విచారణకు హాజరు కాలేదు. ఇక కేజ్రీవాల్ కు మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నందున విచారణకు రాలేనని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ నెల 19న ఈడీ రెండోసారి నోటీసులు ఇచ్చి 21న విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే అనారోగ్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ ఈడీకి సమాచారం అందించారు. దీంతో 2024 జనవరి 3న విచారణకు రావాలని మూడోసారి ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.