తమకు అడుక్కోవడమే కాదు ఇవ్వడమూ తెలుసు అని నిరూపించారు ఉత్తరప్రదేశ్ లోని కాశీ, ప్రయాగ్ రాజ్కి చెందిన కొందరు బిచ్చగాళ్లు. కాశీ విశ్వనాథుడి ఆలయ మెట్ల మీద కూర్చొని అడుకున్నే ఆ బిచ్చగాళ్లు దేవుడి రుణం తీర్చుకున్నారు. అయోధ్య రాముడి దేవాలయానికి తమ వంతు సాయంగా రూ.4.5 లక్షలు విరాళంగా ఇచ్చి తాము ఎవరికీ తక్కువకాదని నిరూపించారు. ఇక మరికొంత మంది యాచకులు తమ ఒక్కరోజు సంపాదనను రామాలయ నిర్మాణానికి దానంగా ఇచ్చారు. కాగా వచ్చే నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.