Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ కేసు.. మనీశ్ సిసోడియాకు బెయిల్

Byline :  Vijay Kumar
Update: 2024-02-12 12:13 GMT

ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో అరెస్టయిన మనీష్ సిసోడియాకు తన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన మేనకోడలు పెళ్లికి హాజరవడానికి ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అనంతరం ఈ కేసులో పలువురిని ఈడీ, సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను కూడా ఈ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు పలుమార్లు నోటీసులు పంపినా తనకు వీలు కావడం లేదంటూ ఆయన ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఇటీవల పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 

Tags:    

Similar News