విద్యాసాగర్ జీ మహారాజ్ మరణం దేశానికి తీరని లోటు.. PM Modi
ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ మరణం దేశానికి తీరని లోటని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ అనారోగ్య శివైక్యం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఆయన చేసిన విలువైన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. తన జీవితాంతం పేదరిక నిర్మూలనతో పాటు సమాజంలో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉన్నారని అన్నారు. ఆయన ఆశీస్సులు అందుకోవడం తన అదృష్టమని అన్నారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో ఆయనతో జరిగిన సమావేశం తనకు మరువలేనిదని అన్నారు. అప్పుడు తాను ఆచార్య జీ నుండి చాలా ప్రేమ,దీవెనలు పొందానని మోడీ అన్నారు. సమాజానికి ఆయన చేసిన అసమానమైన సహకారం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.