Modi : పంచెకట్టులో ప్రధాని మోడీ.. ఫోటోలు వైరల్

Byline :  Vijay Kumar
Update: 2024-01-14 09:06 GMT

ఎప్పుడూ కుర్తా పైజామాలో కనిపించే ప్రధాని మోడీ సంక్రాంతి సందర్భంగా పంచె కట్టారు. పంచె కట్టులో ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోడీ సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టుతో అందరినీ అలరించారు. అనంతరం కేంద్ర మంత్రితో కలిసి కుండలో పాయసం వండారు. గోమాతకు పూజలు చేశారు. పలు రకాల పిండి వంటలను ఆయన రుచి చూశారు. పంచెకట్టులో ఉన్న ప్రధాని మోడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రాజకీయాలతో నిత్యం తీరిక లేకుండా గడిపే మోడీ ఇలా పండగపూట పంచెకట్టులో రావడం ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంది.




Tags:    

Similar News