ఆ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

Byline :  Vijay Kumar
Update: 2023-12-26 01:56 GMT

మూడు క్రిమినల్ చట్ట సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 21, డిసెంబర్ 20న ఈ చట్టాలకు రాజ్యసభ, లోక్‌సభలో ఆమోదం లభించింది.

దీంతో ఈ మూడు క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్నాయి. డిసెంబర్ 21, డిసెంబర్ 20న ఈ చట్టాలకు రాజ్యసభ, లోక్‌సభలో ఆమోదం లభించింది. దీంతో బ్రిటీష్ కాలం నాటి న్యాయ చట్టాలకు కాలం చెల్లింది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చేశాయి. దీనికి సంబంధించి 3 కొత్త క్రిమినల్ చట్టాల బిల్లులకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా వీటికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇండియన్ పీనల్ కోడ్ – ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ – సీఆర్‌పీసీ, సాక్ష్యాల చట్టం – ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టం పేరుతో కేంద్రం ఈ చట్టాలను రూపొందించింది.

డిసెంబర్ 21న రాజ్యసభ ఈ బిల్లులకు ఆమోదం తెలపగా.. డిసెంబర్ 20న వాటిని లోక్‌సభ ఆమోదించింది. కొత్త సవరించిన చట్టాల ప్రకారం ‘నేరం జరిగిన 30 రోజులలోపు వారి నేరాన్ని అంగీకరించినట్లయితే.. అప్పుడు శిక్ష తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త చట్టాల ప్రకారం, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి గడువు నిర్ణయించబడింది. విచారణ నివేదికను జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించిన తర్వాత, దానిని 24 గంటల్లోగా కోర్టు ముందు సమర్పించాలి. మెడికల్ రిపోర్టును నేరుగా పోలీసు స్టేషన్/కోర్టుకు ఏడు రోజుల్లో పంపాలనే నిబంధన ఉంది. చార్జిషీట్ ఇకపై 180 రోజుల తర్వాత పెండింగ్‌లో ఉంచబడదు. అలాగే ఇప్పుడు నిందితులకు నిర్దోషిగా ప్రకటించడానికి ఏడు రోజుల సమయం ఉంటుందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఒక న్యాయమూర్తి ఆ ఏడు రోజుల్లో విచారణ జరపాలి. గరిష్టంగా 120 రోజులలో కేసు విచారణకు వస్తుంది. ముందుగా (ప్లీజ్) బేరసారాలకు ఇందులో కాలపరిమితి లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News