MODI : ఆవులకు మేత పెట్టిన మోడీ

Byline :  Vijay Kumar
Update: 2024-01-14 15:16 GMT

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో పుంగనూరు ఆవులకు పూజలు నిర్వహించారు. అనంతరం వాటికి మేత పెట్టారు. కామధేనూకు ప్రతిరూపంగా, మేలుజాతి ఆవులుగా, అత్యంత నాణ్యమైన పాల దిగుబడులిచ్చేవిగా గుర్తించబడే పుంగనూరు ఆవులు అరుదైన పశుసంతతిగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నిత్యం ప్రధానిగా బిజీగా ఉండే మోడీ ఆదివారం కేంద్ర మంత్రి ఎల్‌.మురగన్ నివాసంలో సంక్రాంతి వేడుకల్లో పంచెకట్టుతో హాజరయ్యారు. గోపూజల్లో, సంక్రాంతి పాయసం వంటకాల్లో పాల్గొన్నారు. అనంతరం తన నివాసానికి వెళ్లిన మోడీ పుంగనూరు ఆవుల పోషణలో పాలుపంచుకున్నారు. రామాలయం ప్రారంభం వరకు తాను సాత్విక ఆహారంతో దైనందిక నిష్టా కార్యక్రమాలతో గడుపుతానన్న మోడీ ఆ మేరకు తన దిన చర్యలను పాటిస్తున్నారు. కాగా ప్రధాని మోడీ గోవులకు మేత పెడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. 




Tags:    

Similar News