Modi : రేపే ప్రాణ ప్రతిష్ఠ.. పీఎం మోడీ దర్శించుకున్న రామాలయాలు ఇవే!

Byline :  Vijay Kumar
Update: 2024-01-21 11:41 GMT

అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీరామాయణ కాలానికి సంబంధించిన ఆలయాలను సందర్శిస్తున్నారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామ్ లల్లాకు పట్టాభిషేక మహోత్సవానికి ముందు ప్రధాని మోడీ రామాయణ కాలానికి సంబంధించిన ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటి వరకు చాలా రామాలయాలను సందర్శించారు.

మోడీ ఇప్పటివరకూ దర్శించుకున్న ఆలయాలు ఇవే..

1. వీరభద్ర ఆలయం,లేపాక్షి

ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షికి చేరుకుని 486 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్ర దేవాలయంలో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కూర్చొని రామభజన చేసి, రంగనాథ రామాయణం ఆధారంగా తోలుబొమ్మల ద్వారా ప్రదర్శించిన రామకథను ప్రధాని వీక్షించారు.

2. గురువాయూర్ ఆలయం

కేరళలోని గురువాయూర్ ఆలయం, త్రిప్రయార్ శ్రీరామ దేవాలయాలను ప్రధాని మోడీ ఈ నెల 17న దర్శించుకున్కనారు. ఈ క్రమంలనే దేవాలయాలలో ప్రధాని మోడీ ప్రార్థనలు చేశారు. గురువాయూర్ ఆలయం, త్రిప్రయార్ శ్రీరామ్ ఆలయంలో ప్రార్థనల సమయంలో ప్రధానమంత్రి సంప్రదాయ దుస్తులైన ముండు (ధోతీ), వేష్టి (తెల్లని శాలువా)లో కనిపించారు.

3. తమిళనాడులోని పలు రామాలయాలు

ఈ నెల 20న ప్రధాని మోడీ తమిళనాడులో పర్యటించి అక్కడ ఉన్న పలు రామాలయాలను దర్శించుకున్నారు. తమిళనాడులోని శ్రీరంగం తిరుచ్చిలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం, రంగనాథస్వామి ఆలయాలను మోడీ దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని ప్రధాని మొదట సందర్శించారు. అక్కడ ఆండాళ్ అనే ఏనుగుకు బెల్లం తినిపించి ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన దేశానికి తొలి ప్రధాని ఆయనే.

4. ధనుష్కోడిలోని కోదండరామస్వామి ఆలయం

ఈ రోజు తమిళనాడులోని ధనుష్కోడిలోని కోదండరామస్వామి ఆలయాన్నిప్రధాని మోడీ దర్శించుకున్నారు. అక్కడ కోదండరాముడికి ప్రత్యేక పూజలు చేశారు.

5. రామ్ కుండ్ కాలా రామ్ దేవాలయం

మహారాష్ట్ర నాసిక్ లోని రామ్ కుండ్ కాలా రామ్ దేవాలయాన్ని కూడా ప్రధాని మోడీ దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

Tags:    

Similar News