అది బీజేపీ-ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. రాహుల్ గాంధీ

Byline :  Vijay Kumar
Update: 2024-01-16 09:12 GMT

అయోధ్య కార్యక్రామన్ని బీజేపీ-ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా మార్చారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మణిపూర్ లోని కోహిమాలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. అయోధ్య కార్యక్రమం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆయన కోసమే జరుగుతున్న కార్యక్రమం అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అయోధ్య ఇష్యూని పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు కాబట్టే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆ కార్యక్రమానికి రావడం లేదని అన్నారు.

ఇక దేశంలోని అనేక హిందూ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు కూడా అయోధ్యకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని అన్నారు. ఇక ఇండియా కూటమిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించుకుని ముందుకు పోతామని అన్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్లు పంపకాలు ఇంకా జరగలేదని తెలిపారు. తాను మొదట పాదయాత్ర చేద్దామనుకున్నానని, కానీ సమయం లేకపోవడంతో హైబ్రిడ్ (పాదయాత్ర,బస్ యాత్ర) చేస్తున్నానని అన్నారు. 

Tags:    

Similar News