RS Praveen : వారికి నర్సింగ్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు ఇవ్వండి.. ఆర్ఎస్ ప్రవీణ్ వినతి

Byline :  Vijay Kumar
Update: 2024-02-05 16:25 GMT

తెలంగాణలో ఇటీవల నర్సింగ్ ఆఫీసర్లు నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల కిందట హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మొత్తం 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో వారికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చేసి తెలంగాణ గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో పార్ట్ టైం కింద హెల్త్ సూపర్వైజర్లుగా పనిచేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో వారు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ ఆఫీసర్లను నియామకం చేయడంతో గురుకులాల్లో పని చేసే దాదాపు 1000 మందికి పైగా నర్సులు ఉపాధి కోల్పోయారని అన్నారు. వారందరికీ పది సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని అన్నారు. ఏదైనా స్వీమ్ ద్వారా వారికి ఉద్యోగం కల్పించాలని ఆర్ఎస్ ప్రవీణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.




Tags:    

Similar News