కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సెర్బియా ఆహ్వానం

Update: 2024-01-19 15:22 GMT

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి తమ దేశానికి రావాల్సిందిగా సెర్బియా ఆహ్వానం పంపింది. ఈఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు బెల్దేడ్ లో జరిగే.. 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ (ఐటీఎఫ్)కు హాజరుకావాలని సెర్బియా పర్యాటక శాఖ మంత్రి హుసేన్ మెమిక్ ఆహ్వానపత్రాన్ని పంపించారు. యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్ గా ఇది నిలవనుంది. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతుండగా ఈసారి 'అడ్వెంచర్ బిగిన్స్ హియర్' అనే థీమ్ ఈ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ జరగనుంది. వివిధ దేశాలనుంచి పర్యాటక శాఖల మంత్రులు, ఈ రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు, ఇన్వెస్టర్లు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు. కాగా ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆయన అయోధ్య కార్యక్రమానికి సంబంధించిన ప్రచారం బాధ్యతలను అక్కడి ప్రభుత్వంతో కలిసి చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కేంద్రం ప్రభుత్వంతో పాటు యూపీ ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపట్టింది.


Tags:    

Similar News