పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో విపక్ష సభ్యుల నిరసనలతో సోమవారం లోక్ సభ దద్దరిల్లింది. పార్లమెంట్ కు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల నుంచి విపక్షాలకు చెందిన 31 మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. కాగా సభను సజావుగా సాగనీయడం లేదంటూ గతవారం కూడా విపక్షాలకు చెందిన 13 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.