క్రిస్మస్ ను పురస్కరించుకుని ఒడిశాలోని పూరి బ్లూ ఫ్లాగ్ బీచ్ లో రూపొందించిన శాంతాక్లాజ్ సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈ సారి శాంతాక్లాజ్ ను ఉల్లిగడ్డలతో రొపొందించాడు. ఎర్ర ఉల్లిగడ్డలు, తెల్ల ఉల్లిగడ్డలతో శిల్పాన్ని రూపొందించాడు. ఇక ఈ క్రిస్మస్ సందర్భంగా 'గిఫ్ట్ ఏ ప్లాంట్, గ్రీన్ ది ఎర్త్' అంటూ పర్యావరణాన్ని కాపాడాలనే సందేశాన్ని పచ్చని ఆకులతో శాంతాక్లాజ్ శిల్పం కింద రాశాడు. అలాగే శిల్పం ముందు పలు రకాల చెట్లతో కూడిన కుండీలను పెట్టాడు.