కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన అక్క రాజేశ్వరిబెన్ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేశ్వరిబెన్‌కి కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది. తర్వాత ఆమెను ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన నేపథ్యంలో గుజరాత్‌లో జరగాల్సిన రెండు బహిరంగ కార్యక్రమాలను అమిత్ షా రద్దు చేసుకున్నారు. తన అక్క చనిపోవడంతో అమిత్ షా తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారని ఓ బీజేపీ నేత సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గుజరాత్‌కు చేరుకుని సోదరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గుజరాత్‌లోని థాల్‌తేజ్ స్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమిత్ షా కుటుంబ సభ్యులకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
అమిత్ షా సోదరి రాజేశ్వరిబెన్ వయసు 65 ఏళ్లని తెలుస్తోంది. ఆమె అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్నారు. ఆ తరువాత ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. గత వారం అమిత్ షా కూడా HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో ఆమెను కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూడా రాజేశ్వరిబెన్‌ను పరామర్శించారు.