లోక్ సభ ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రెడీ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీగా ఉందని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ సారి కూడా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోబోతుందని అన్నారు. ఇక తెలంగాణలో కూడా బీజేపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీజేపీనే ఆదరిస్తారని అన్నారు. పార్లమెట్ ఎన్నికల సమాయత్తంలో భాగంగా ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. ఈ సందర్బంగా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సూచనలు చేయనున్నారని పేర్కొన్నారు. అమిత్ షా పర్యటన అనంతరం తమ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తామని తెలిపారు.