Nirmala Sitharaman : తమిళనాడు ప్రభుత్వం వివక్ష చూపుతోంది.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Byline :  Vijay Kumar
Update: 2024-01-21 10:38 GMT

అయోధ్య రామ మందిరం విషయంలో తమిళనాడు ప్రభుత్వం వివక్ష చూపుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. రామ మందిర కార్యక్రమాలను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసిందని అన్నారు. రేపు (జనవరి 22) జరగనున్న రామ మందిర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని ఆరోపించారు. తమిళనాడులో మొత్తం 200కి పైగా శ్రీరాముడి ఆలయాలు ఉన్నాయని, అయితే అయోధ్య కార్యక్రమం సందర్భంగా ఆ దేవాలయాల్లో ఎలాంటి పూజలు జరగడం లేదని అన్నారు.

శ్రీరాముడి పేరిట భజన, ప్రసాదం, అన్నదానానికి స్టాలిన్ ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం లేదని అన్నారు. ప్రైవేట్ గా నిర్వహిస్తున్న ఆలయాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హిందూ వ్యతిరేక ధోరణిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆమె ట్వీట్ చేశారు. కాగా డీఎంకే పెద్దలు మాత్రం నిర్మలా సీతారామన్ ఆరోపణలను కొట్టిపారేశారు.

Tags:    

Similar News