రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర అధికారులను బదిలీ చేశారు. తాజాగా రవాణా శాఖలో భారీగా బదిలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీల్లో భాగంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ), 23 మంది రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్లు (ఆర్టీవో), ఏడుగురు డిటీవోలను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా డిసెంబర్ 7న రాష్ట్రంలో కొలువుదీరిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పూనుకొంది. ఇప్పటికే రూ.10లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్య హామీలను అమలు చేస్తుండగా త్వరలోనే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ హామీలను అమలు చేయనుంది.