రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం..

Update: 2024-01-19 10:53 GMT

హైదరాబాద్‎లోని రామోజీ ఫిల్మ్‎ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కంపెనీ సీఈఓ మృతిచెందాడు. విస్టెక్స్ కంపెనీకి సంబంధించిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కంపెనీ చైర్మన్ విశ్వనాధరాజ్, సీఈవో సంజయ్ షాతో పాటు పదుల సంఖ్యలో ఉద్యోగులు కూడా హాజరయ్యారు. అయితే లైమ్ లైట్ గార్డెన్‎లో ఫంక్షన్ ప్రారంభానికి ముందు కంపెనీ సీఈవో, చైర్మన్ క్రేన్ మీదుగా కిందికి దిగుతుండగా క్రేన్ వైర్లు తెగిపోయాయి. దాంతో కంపెనీ సీఈవోతో పాటు పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. ఈ ఘటనలో కంపెనీ సీఈవో సంజయ్ షా మృతిచెందగా.. చైర్మన్ విశ్వనాధరాజ్‎కు తీవ్రగాయాలయ్యాయి. ఫిల్మ్‎సిటీ నిర్వాహకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News