ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా అరవింద్ పనగరియా

Byline :  Vijay Kumar
Update: 2023-12-31 12:28 GMT

నీతి ఆయోగ్ మాజీ వైస్​ చైర్మన్ అరవింద్‌ పనగరియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ, 16వ ఆర్థిక సంఘానికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఆ ఉత్వర్వుల్లో పేర్కొంది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్, ఇతర సభ్యులు బాధ్యతలు చేప్టటిన తేదీ నుంచి తుది నివేదిక సమర్పించే తేదీ వరకు లేదా 2025 అక్టోబర్ 31 వరకు ఆ పదవిలో ఉంటారు. ఈ సంఘం ఐదేళ్ల కాలానికి (2026-27 నుంచి 2030-31 వరకు) సంబంధించిన సిఫారసుల నివేదికను 2025 అక్టోబర్ లో రాష్ట్రపతికి అందిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నవంబర్ నెలలో 16వ ఆర్థిక సంఘం నిబంధనలకు ఆమోదం తెలిపింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయ పెంపు చర్యలను సూచించడంతోపాటు, విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం ఏర్పాటు చేసిన నిధులకు సంబంధించి విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రస్తుత ఏర్పాట్లను కమిషన్ సమీక్షిస్తుంది. 

Tags:    

Similar News