Bhatti Vikramarka : రాహుల్ ఆలోచనల మేరకే కులగణన..

Byline :  Vijay Kumar
Update: 2024-02-18 11:27 GMT

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకే తాము తెలంగాణలో కులగణన చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం జడ్చర్లలో జరిగిన కార్నర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ జడ్చర్లలో పర్యటించినప్పుడు మొట్టమొదటిసారి కులగణన చేయాలని అన్నారని తెలిపారు. ఇంతటి చారిత్రాత్మకమైన కులగణన విషయాన్ని రాహుల్ గాంధీ జడ్చర్ల వేదికగా ప్రకటించారని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ చెప్పినట్లే తాము అసెంబ్లీలో కులగణన చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేశామని అన్నారు. దేశంలోని సంపద, వనరులు కొద్ది చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని, ఆ సంపదను, వనరులను దేశంలో అత్యధిక శాతంగా ఉన్న బలహీన వర్గాలకు కూడా అందించాలని రాహుల్ భావించారని అన్నారు. ఈ క్రమంలోనే కులగణన జరగాలని రాహుల్ గొంతెత్తి చాటారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడటం కోసం రాహుల్ యాత్ర చేస్తున్నారని అన్నారు. రాహుల్ యాత్రకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News