వారిపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

Byline :  Vijay Kumar
Update: 2024-01-30 13:07 GMT

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న దాడులపై మంగళవారం బీఆర్ఎస్ నేతలు డీజీజీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్ భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడులు, హత్యల గురించి డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి సమక్షంలోనే జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నేతలకు సపోర్టుగా బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విధానాన్ని తక్షణమే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని కోరారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా దాడులకు పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసినవారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు సైది రెడ్డి, భాస్కర్ రావు, కోరుకంటి చందర్, భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యాపేట జెడ్పీ చైర్ పర్సన్ దీపిక, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్ తదితరులు ఉన్నారు. 

Tags:    

Similar News