కరెంట్ బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

Byline :  Vijay Kumar
Update: 2024-01-31 10:43 GMT

కరెంట్ బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలెవరూ కరెంట్ బిల్లులు కట్టవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొన్నారని అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు చెప్పారని అన్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గంలోని 106 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలీటీల్లోని 60 వార్డులు, 5 మండలాల్లోని ప్రజలెవరూ కూడా 200 యూనిట్లలోపు కరెంట్ వాడితే బిల్లులు కట్టవద్దని చెప్పారు. కరెంట్ బిల్లుల కోసం విద్యుత్ అధికారులు వస్తే వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన వీడియోలు చూపించాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజల ముందుకు వచ్చింది. అందులో ఒక గ్యారెంటీ 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు హామీలను అమలు చేస్తోంది. 

Full View

Tags:    

Similar News