అసెంబ్లీలో బర్త్ డే జరుపుకున్న ఎమ్మెల్యే

Update: 2023-12-21 09:52 GMT

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేటాయించిన చాంబర్ లో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్లంతా కౌషిక్ రెడ్డికి కేక్ తినిపించి విషెస్ తెలిపారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాడి కౌషిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించి కౌషిక్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

Tags:    

Similar News