ఆ సైనికుల స్ఫూర్తితో ముందుకు పోతాం.. ఆర్ఎస్ ప్రవీణ్

Byline :  Vijay Kumar
Update: 2024-01-01 09:46 GMT

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మహారాష్ట్రలోని భీమా కోరెగాం విజయ స్థూపాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మరికొందరు బీఎస్పీ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. 200 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని పీష్వాలకు మహర్ సైనికులకు మధ్య యుద్ధం జరిగిందని అన్నారు. ఆ యుద్ధంలో 28 వేల సైనిక బలం కలిగిన పీష్వాలను మహర్ సైనికులు ఓడించారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ యుద్ధంలో అమరులైన మహర్ సైనికుల స్మృత్యార్థం భీమా కోరెగాం విజయ స్థూపాన్ని నిర్మించారని తెలిపారు. ఈ ప్రదేశాన్ని సందర్శించడం చాలా గొప్ప అనుభూతినిచ్చిందని, మహర్ సైనికులు స్ఫూర్తితో బహుజన రాజ్యాన్ని సాధిస్తామని ఆర్ఎస్పీ తెలిపారు. 

Tags:    

Similar News