ఈ రోజు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమస్యలతో పాటు ప్రధాని మోడీతో భేటీపై వారితో చర్చించారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన అంశాలపై సోనియా, ఖర్గేలకు వారు వివరించారు. నిధుల సమీకరణ ఎలా అనే అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బిల్లులను, పలు హామీలను అమలు చేయాలని కోరిన విషయం తెలిసిందే.