గత ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని చూసింది.. CM Revanth Reddy

Byline :  Vijay Kumar
Update: 2024-02-26 14:03 GMT

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. బీమా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో పని చేస్తున్నా దాదాపు 43 వేల మందికి ఈ బీమా పథకం అందుతుందని అన్నారు. ఈ మేరకు బ్యాంకర్లతో ఎంవోయూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషించిందని అన్నారు. తెలంగాణ సాధనలో సింగిరేణి కార్మికులు తమ వంతు పాత్ర పోషించారని అన్నారు. కానీ గత పదేళ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని అన్నారు. ఎన్నో ప్రభుత్వ సంస్థలతో పాటు బొగ్గు గనులను కూడా కేంద్రం వేళం వేయాలని చూస్తోందని అన్నారు. పదేళ్లలో వందేండ్ల విధ్వంసం చేశారని అన్నారు. మిగులు రాష్ట్రానని గత ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందని అన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని అన్నారు.

ధనదాహానికి బలైన ప్రాజెక్టులను ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. పదేళ్ల పాలనపై ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడ్తామని అన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ప్రొఫెసర్లతో ఉచితంగా ఆన్ లైన్ కోచింగ్ ఇప్పిస్తామని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రజలు ఎందుకు ఓటేయాలని అన్నారు. మూడోసారి మోడీ ప్రధాని ఎందుకు కావాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించడం లేదని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావొస్తున్నా ఒక్కసారి కూడా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడలేదని అన్నారు. ఇదేనా తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు.

ఇక కేటీఆర్ వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, నిజమైన లబ్దిదారులకే పథకాలు అందుతాయని సీఎం స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News