Revanth Reddy : AIPDM-2024లో రాష్ట్రానికి పతకాలు.. సీఎం రేవంత్ ప్రశంసలు

Byline :  Vijay Kumar
Update: 2024-02-16 11:34 GMT

లక్నోలోని ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలోనే 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కింది. అలాగే ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీతో పాటు 5 బంగారు పతకాలు, 7 రజత పతకాలు వచ్చాయి. ఈ మేరకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి విజేతలకు పతకాలు అందజేశారు. ఈ నేపథ్యంలో అసాధారణ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీని సీఎం రేవంత్ అభినందించారు.

Tags:    

Similar News